కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

April 19, 2024

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

హీరోయిన్ తానీషా ముఖర్జీ.. ఈ పేరు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి అందగా తెలియకపోయినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన తెలిసిందె. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కంత్రి సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది.

అలాగే హిందీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన వాక్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా తానీషా ముఖర్జీ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా సమయంలో నేను షూటింగ్ చేస్తూ ఒక ఎత్తైన కొండపై నుంచి కిందకు పడ్డాను. ఆ సమయంలో నా తలకు బలంగా గాయం అయ్యింది. డాక్టర్స్ నా మెదడుకు గాయం అయ్యిందని తెలిపారు. ఏడాది పాటు రెగ్యులర్‌గా ఆస్పత్రికి వెళ్తూ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది.

అయితే నామెదడుకు గాయం అయ్యిందని ఎవ్వరికి చెప్పలేదు. అసలే మొదటి సినిమా నన్ను ఎక్కడ తీసేస్తారో అని చెప్పలేదు. కానీ ఆ బాధతోనే షూటింగ్ లో పాల్గొన్నాను. నా బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా కనిపించలేక పోయాను. చాలా సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పలికించలేకపోయాను. దాంతో చాలా మంది నాకు నటన రాదు అని విమర్శించారు. కానీ వారికి నా గాయం గురించి తెలియదు కదా అని చెప్పుకొచ్చింది తానీషా ముఖర్జీ. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: ప్రభాస్ పెళ్లి పై హీరో విశాల్ కామెంట్స్… ఫస్ట్ కార్డు ఆయనకే అంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు