March 28, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు నాగచైతన్య నటి సమంత ఒకరు వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహమైన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియవు కానీ వీరిద్దరూ మాత్రం విడిపోవడం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
ఇక సమంత నాగచైతన్య విడిపోవడానికి ఎన్నో కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంతకు సినిమాలలో నటించడం ఇష్టమని కానీ అక్కినేని ఫ్యామిలీ నో చెప్పిందని వార్తలు వచ్చాయి. అలాగే పిల్లల విషయంలో కూడా గొడవలు జరిగాయని సమంత అక్కినేని వ్యాపారాలలో వేలు పెట్టింది అంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే తాజాగా తీన్మార్ మల్లన్న విడాకుల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వ్యవహారంలో భాగంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆమె ఫోన్ టాప్ చేసి ఒక వీడియోని తనకు చూపించి పెద్ద ఎత్తున డబ్బులను డిమాండ్ చేశారట అయితే ఆ డబ్బుకు సమంత లొంగక పోవడంతో ఆ వీడియోని అక్కినేని ఫ్యామిలీకి షేర్ చేశారని తెలుస్తోంది.
ఇక ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారని ఆయన ప్రస్తుతం మందుల వ్యాపారాలు చేస్తూ ఉన్నారని ఆయన ప్రమేయం కారణంగానే ఇదంతా జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి ఈయన చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
Read More: పవన్ పిలిచాలే కానీ .. జనసేన ప్రచారానికి సిద్ధమైన అనసూయ?