March 28, 2024
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా పలు పార్టీలకు మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కొందరు వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపగా మరికొందరు తెలుగుదేశం పార్టీకి మరికొందరు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇక ఎన్నికలు త్వరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఓటు గురించి అవగాహన కల్పించడమే కాకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే యాంకర్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల గురించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజానికి నాకు రాజకీయాలు అంటే ఏమాత్రం పడవు కానీ మా నాన్న రాజకీయ ప్రచారాల కోసం వెళ్లేవారని నేనే ఆయన చేత మాన్పించానని అనసూయ వెల్లడించారు.
ఇలా నాన్న చేత రాజకీయాలు మానిపించిన తాను ప్రచార కార్యక్రమాల కోసం సిద్ధమే అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేను ఏ పార్టీకి మద్దతు తెలిపిన ఓటు వేసేటప్పుడు పార్టీ ఏది అని ఎవరు చూడకు. మనకు సరైన నాయకుడు ఎవరు? సమర్థవంతుడు ఎవరు అనే విషయాలను గుర్తు పెట్టుకొని మాత్రమే ఓటు వేయాలని ఈమె తెలియజేశారు. ఈ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఈ సొసైటీ కి ఒక మంచి లీడర్ అవసరం అందుకే ఓటు వేసేటప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిజమైన లీడర్ అని ఈమె తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలిస్తే తప్పకుండా తాను జనసేన ప్రచార కార్యక్రమాలకు వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి అనసూయ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తనని ప్రచార కార్యక్రమాలకు ఆహ్వానిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read More: యుఎస్ లో టిల్లు స్క్వేర్ రికార్డ్స్.. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్!