నా కొడుకుకు అందుకే తారక్ అని పేరు పెట్టాను.. నందు కామెంట్స్ వైరల్!

April 3, 2024

నా కొడుకుకు అందుకే తారక్ అని పేరు పెట్టాను.. నందు కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి వారిలో నటుడు నందు ఒకరు. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా నందు ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈయన సింగర్ గీత మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఇటీవల గీతామాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ బిడ్డకు ధ్రువధీర్ తారక్ అనే నామకరణం చేశారు. ఇలా తన కుమారుడి పేరులో తారక్ అని రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కొడుకు పేరులో తారక్ అని పెట్టడానికి గల కారణాన్ని తెలియజేశారు.

తన కొడుకు పేరులో తారక్ అని పెట్టడానికి పెద్దగా కారణాలు లేవని తెలిపారు. తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అందుకే ఆ పేరు వచ్చేలా పెట్టమని తెలిపారు. తనకు తారక్ అనే పేరు అంటే చాలా ఇష్టం ఆ పేరులో ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుందని ఈయన తెలియజేశారు.అదేవిధంగా ఈ ఏడాది అయోధ్యలో బాలరామయ్య కొలువై ఉన్న సంగతి మనకు తెలిసింది చాలా సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామయ్య కొలువు కావటం ఎంతో గొప్ప విషయం.

అలా అయోధ్యకు రామయ్య వచ్చిన తరుణంలో మా ఇంటికి కూడా ఈ చిన్నారి రావడంతో సాక్షాత్తు ఆ తారక రాముడే మా ఇంటికి వచ్చారనిపించింది. అందుకే బాబు పేరులో తారక్ అని వచ్చేలా పెట్టుకున్నాము అంటూ ఈ సందర్భంగా తన కొడుకు పేరులో తారక్ అనిపెట్టడం వెనుక ఉన్నటువంటి కారణాలను తెలుపుతూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో ఎంతోమంది ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: మినీ డ్రెస్ లో కిరాక్ లుక్స్ లో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చిన బ్యూటీ?

ట్రెండింగ్ వార్తలు