ఒకే రోజు 27 సినిమాలు రిలీజ్.. ఓటీటీ ప్రియులకు పండగే పండగ!

December 25, 2023

ఒకే రోజు 27 సినిమాలు రిలీజ్.. ఓటీటీ ప్రియులకు పండగే పండగ!

This Week Ott Releases: 2023 సంవత్సరం ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. ఈ ఏడాదిలో ఇదే చివరివారం కావడంతో ఓటీటీలోకి పలు చిత్రాలు క్యూ కట్టాయి. ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మంగళవారం, 12th ఫెయిల్, నయనతార నటించిన అన్నపూరణి వంటి సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇకపోతే హిందీ, ఇంగ్లీష్ మూవీస్, వెస్ సిరీస్‌లు చాలా వరకూ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. మరి అవేంటో ఒక లుక్కేద్దాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో భారీగానే సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. డిసెంబర్ 25వ తేదిన(This Week Ott Releases) రికీ గెర్వైస్ అనే ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో స్ట్రీమింగ్ కానుంది. స్నాగ్ అనే చిత్రం సందడి చేయనుంది. 26న థ్యాంక్యూ ఐ యామ్ సారీ అనే స్వీడిష్ మూవీ, కో గయే హమ్ కహా అనే హిందీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 27న ఏ వెరీ గుడ్ గర్ల్, హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ చిత్రం స్ట్రీమింగ్ కానుండగా 28న లిటిల్ డిక్సీ, మిస్ శాంపో, పోకేమన్ కన్సేర్జ్, తెలుగు డబ్బింగ్ మూవీ అన్నపూరణి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఇకపోతే 29న బ్యాడ్ ల్యాండ్స్, బెర్లిన్, శాస్త్రి విరుద్ శాస్త్రి, త్రీ ఆఫ్ అజ్ వంటి మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇండోనేషియన్ మూవీ కటాటన్ ఎస్ఐ బాయ్, టైగర్ 3 చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే మరో ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో తెలుగు సినిమా మంగళవారం డిసెంబరు 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు డబ్బింగ్ మూవీ 12th ఫెయిల్ కూడా డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5 ఓటీటీలో దోనో, వన్స్ అపాన్ టూ టైమ్స్, సఫేద్ వంటి చిత్రాలు ఎంట్రీ ఇస్తున్నాయి.

Read Moreహనుమాన్ ని తొక్కేస్తున్నారా..గుంటూరు కారం సోలో రిలీజ్ కుదిరేనా?

ట్రెండింగ్ వార్తలు