హనుమాన్ ని తొక్కేస్తున్నారా..గుంటూరు కారం సోలో రిలీజ్ కుదిరేనా?

December 25, 2023

హనుమాన్ ని తొక్కేస్తున్నారా..గుంటూరు కారం సోలో రిలీజ్ కుదిరేనా?

Guntur Kaaram: సంక్రాంతి అంటేనే పెద్ద సినిమాల హవా పక్కా ఉంటుంది. అగ్ర హీరోల మూవీలు కచ్చితంగా పోటీ పడతాయి. థియేటర్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా థియేటర్ల కోసం పెద్ద సినిమాల పోటీ పక్కా ఉండేలా కనిపిస్తోంది. ఇక చిన్న సినిమాలూ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ చిన్న సినిమాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు హనుమాన్. అయితే ఈ సినిమా విడుదలకు అడ్డు వస్తున్నారని కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఈ అడ్డు వస్తున్న వారు ఎవరంటే..?

ఈసారి పొంగల్ బరిలో నిలిచేందుకు టాలీవుడ్ సినిమాలు క్యూలో ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న మూవీస్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’(Guntur Kaaram), తేజ సజ్జా ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్‌’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఫ్యామిలీ స్టార్’. వీటితోపాటు తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ కూడా వస్తామంటూ ప్రకటించారు.

ప్రతిసారి లాగానే ఈ 2024 పొంగల్ నిమాలకు థియేటర్స్ కావాలంటే చాలా కష్టం ఉంది. దీంతో ఒకటి రెండు సినిమాలు వెనక్కి తగ్గితే బాగుంటుందని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. తాజాగా ఈ పొంగల్ ఫైట్ గురించి దిల్ రాజు మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.

అందరికి సంక్రాంతికే సినిమాలు రిలీజ్ కావాలి. ఈ పండక్కి వస్తే ఏవో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం. అయితే ఒకే సమయంలో అన్ని సినిమాలు అంటే థియేటర్స్ దొరకడం కచ్చితంగా కష్టం. అందుకే నేను నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ని సమ్మర్ కి పోస్ట్ చేశాను. ఇక మిగిలిన ఐదు సినిమాల్లో గుంటూరు కారం ముందుగా అనౌన్స్ చేసింది కాబట్టి అది పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ లేదు. మిగిలిన నాలుగు సినిమాల నిర్మాతలు ఆలోచించుకోవాలన్నారు.

హనుమాన్ నిర్మాతలు కూడా నన్ను వచ్చి కలిశారు. ఎలా చేస్తే బాగుంటాదని సలహా అడిగారు. వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరని కాంట్రవర్సీలు సృష్టించకండని అన్నారు. అయితే ఈ హనుమాన్ మూవీపై కుట్ర జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా లేవనెత్తారు.

Read More250 కోట్లతో పాన్ ఇండియా మూవీ: బిగ్ బాస్ కౌశల్

ట్రెండింగ్ వార్తలు