March 29, 2024
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఇదివరకే డీజె ట్టిల్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఏంటి అనే విషయానికి వస్తే..
కథ: ఇక కథలోకి వస్తే పాత దెబ్బ నుంచి కోలుకుని టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఇలా తన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి టిల్లు జీవితంలోకి ఒకరోజు అనుకోకుండా లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. లిల్లీ రాకతో టిల్లు ప్రవర్తన కూడా మారుతుంది. మళ్లీ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్రెష్ ప్రాబ్లమ్ తో లిల్లీ తనని సాయం కోరుతుంది. మరి ఆల్రెడీ రాధికా వల్ల దెబ్బ తిన్న తాను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా(నేహా శెట్టి) ఉందా లేదా చివరికి ఈ కథ ఎటువైపు మళ్ళీంది అనే విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లు గా షైన్ అయ్యాడు. తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని సన్నివేశాలలో ఈయన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ఇక అనుపమ నటన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక ఈమె కొన్ని సన్నివేశాలలో కాస్త రొమాంటిక్ శృతిమించి పోయిందని చెప్పాలి. మురళీ శర్మ ప్రిన్స్ బ్రహ్మాజీ వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
విశ్లేషణ: డిజె టిల్లు సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి అయితే అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందని చెప్పాలి.సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా సాగుతుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి చికిత్స అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కడ నిరాశపరచకుండా మంచిగా ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి.
బాటమ్ లైన్: డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం ప్రేక్షకులను ఎక్కడ నిరాశపరచలేదని చెప్పాలి. కామెడీ పరంగా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి అయితే అక్కడక్కడ కొన్ని బోరింగ్ సన్నివేశాలు కామన్ సీన్స్ ఉన్నాయి మొత్తానికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.