Aadu Jeevitham Twitter Review: ఆడు జీవితం సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు.. పదహారేళ్ల కష్టానికి ప్రతిఫలం అంటున్న హీరో!

March 28, 2024

Aadu Jeevitham Twitter Review: ఆడు జీవితం సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు.. పదహారేళ్ల కష్టానికి ప్రతిఫలం అంటున్న హీరో!

మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లేస్సి డైరెక్షన్లో నటించిన ది గోట్ లైఫ్ మూవీ నీ తెలుగులో ఆడు జీవితం పేరుతో మార్చి 28న రిలీజ్ చేశారు. బెన్యామిన్ రచించిన ది గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమాని ఇప్పటికే చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. సినిమా కోసం పృధ్విరాజ్ సుకుమారన్ చాలా కష్టపడ్డాడు.

డైరెక్టర్ బ్లేస్సి అద్భుతంగా సినిమాని తెరకెక్కించారని, ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలని లోకనాయకుడు కమల్ హాసన్ ట్విట్ చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా ఈ సినిమాపై స్పందిస్తూ బ్లేస్సి కి నా ధన్యవాదాలు, ఒక వ్యక్తి కథను ఈ విధంగా తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదు. దర్శకుడు హార్డ్ వర్క్ కి ఇది నిదర్శనం. సినిమా విజువల్ వండర్స్ కి నేను చాలా ఆశ్చర్యపోయాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పృధ్వీరాజ్ స్పందిస్తూ ఆడు జీవితం సినిమాకి దక్కిన పెద్ద అవార్డు ఇది, పదహారేళ్ల కష్టానికి ప్రతిఫలం అని పోస్ట్ పెట్టారు.

సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా క్యూరియాసిటీ గా ఉంటుందని, ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇక ఎప్పటిలాగే పృధ్వీరాజ్ సుకుమార్ అని నటన లుక్ తో మరింత కట్టుకున్నాడని తెలుస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ పై పలువురు ప్రేక్షకులు సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో హీరో కూడా అంత ప్రాణం పెట్టి సినిమాలో నటించాడు.

ఈ సినిమాతో వీళ్ళకి 16 సంవత్సరాల అనుబంధం ఉంది సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ రసూల్ పూకుట్టి వంటి క్రియేటివ్ టెక్నీషియన్స్ పనిచేశారు. బతుకుతెరువు కోసం సౌదీ వెళ్ళిన మలయాళీ నజీబ్ అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, మళ్ళీ అక్కడ నుంచి ఇండియాకు ఎలా వచ్చాడు అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది.

Read More: జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి అదే కారణం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ?

ట్రెండింగ్ వార్తలు