ఒకింటివాడైన మసూద మూవీ హీరో.. అమ్మాయి ఎవరో తెలుసా?

April 22, 2024

ఒకింటివాడైన మసూద మూవీ హీరో.. అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు తిరువీర్. కాగా తిరువీర్ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా మసూద. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు తిరువీర్. ఇది ఇలా ఉంటే తాజాగా తిరువీర్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా పెళ్లి పీటలెక్కాడు. తన ప్రియురాలు కల్పన రావు మెడలో మూడు ముళ్లు వేసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

కాగా ఈ జంట పెళ్లి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తిరువీర్ స్వయంగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించారు తిరువీర్. హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తిరువీర్ పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ మసూద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లో నటించింది మెప్పించారు. ఇకపోతే ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ జోడి క్యూట్ కపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: ఆరేళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్!

Related News

ట్రెండింగ్ వార్తలు