ఆరేళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్!

April 22, 2024

ఆరేళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్!

తెలుగు ప్రేక్షకులకు హీరో నటుడు నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు నారా రోహిత్. సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీఫెలో వంటి సూపర్ హిట్ సినిమాలతో ఒకప్పుడు మెరిశాడు నారా రోహిత్. కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత నారా రోహిత్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రోహిత్ చివరిసారిగా 2018లో వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు.

ఇక అప్పటీ నుంచి మళ్ళీ నారా రోహిత్ తెరపై కనపడలేదు. అలా నారా రోహిత్ ఒకటి రెండు కాదు దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత సుందరకాండ సినిమాని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నారా రోహిత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. 2017, 2018 ఆ సమయంలో నా సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. నా సినిమాలు నాకే కొన్ని నచ్చలేదు.

నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలే నాకు నచ్చలేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నాకు నచ్చలేదు అనిపించింది. దీంతో ఒక రెండేళ్లు గ్యాప్ తీసుకుందాము అనుకున్నాను. ఆ తర్వాత కరోనా కూడా రావడంతో ఆ గ్యాప్ ఇంకా పెరిగింది. కానీ ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. వాటిల్లో కొన్ని ఓకే చేసాను. ఇప్పుడు ప్రతినిధి 2తో వస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇకపై వరుసగా సినిమాలు వస్తాయి. మళ్ళీ గ్యాప్ తీసుకోను, మంచి కథలతో వస్తాను అని తెలిపారు నారా రోహిత్.

Read More: మరోసారి ముంబైలో మెరిసిన తారక్.. వైట్‌ షర్ట్ జీన్స్ లో ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌?

ట్రెండింగ్ వార్తలు