సురేష్‌ ప్రొడక్షన్స్‌: ఇక్కడ రీమేక్‌లు చేయబడును

January 6, 2022

సురేష్‌ ప్రొడక్షన్స్‌: ఇక్కడ రీమేక్‌లు చేయబడును

Suresh Productions:టాలీవుడ్‌లో అగ్రనిర్మాణ సంస్థ అయిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఒకప్పుడు భారీ స్థాయి సినిమాలనే నిర్మించింది. కానీ రీసెంట్‌ టైమ్స్‌లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఎక్కువగా రీమేక్‌ సినిమాలపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా సురేష్‌ప్రొడక్షన్స్‌ సంస్థ నుంచి వచ్చిన ‘నారప్ప’(తెలుగులో ‘అసురన్‌’), ‘దృశ్యం 2’ (మలయాళం ‘దృశ్యం 2’కి తెలుగు రీమేక్‌) సినిమాలు రీమేక్సే. ఇక ఈ సంస్థలోనే ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని ఉన్న ఉన్న శాకిని డాకిని చిత్రం హాలీవుడ్‌ మూవీ మిడ్‌నైట్‌ రన్నర్స్‌కు తెలుగు రీమేక్‌. ఇక కొరియన్‌ మూవీ ‘లైఫ్‌ కీ’, బాలీవుడ్‌ మూవీస్‌ ‘దే దే ప్యార్‌ దే’, ‘డ్రీమ్‌గాళ్‌’ సినిమాల రీమేక్స్‌ను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలోనే ఉన్నాయని తెలిసింది. ఇన్ని రీమేక్‌ చిత్రాలు ఉన్నప్పటికీ తాజాగా తమిళంలో శింబు హీరోగా నటించిన ‘మనాడు’ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకుంది సురేష్‌ ప్రొడక్షన్స్‌. తమిళంలో విడుదలైన మనాడు సినిమాకు మిక్డ్స్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘మానాడు’ తెలుగు హక్కులను సురేష్‌ ప్రొడక్షన్స్‌ దక్కించుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

Readmoreతెలుగువ్యాపారవేత్తగా బాలీవుడ్‌ హీరో

ట్రెండింగ్ వార్తలు