కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో సినిమా చేయనంటున్న స్టార్ డాటర్.. కారణం సమంతనేనా?

March 19, 2024

కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో సినిమా చేయనంటున్న స్టార్ డాటర్.. కారణం సమంతనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినటువంటి నాగచైతన్య ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కొంతకాలం పాటు సమంత ప్రేమలో ఉన్నటువంటి ఈయన పెద్దలను ఒప్పించి సమంతను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైనటువంటి మూడు సంవత్సరాలకు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన వీరిద్దరూ కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక స్టార్ హీరో కుమార్తె తనకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నేను నాగచైతన్య సినిమాలలో చేయను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఇలా ఈమె నాగ చైతన్య సినిమాలో నటించకపోవడానికి కారణం సమంతనే అని తెలుస్తుంది. నాగచైతన్య సినిమాలను రిజెక్ట్ చేసినటువంటి ఆ స్టార్ డాటర్ ఎవరు ఈమె రిజెక్ట్ చేయడానికి సమంతకు గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సినిమాలను రిజెక్ట్ చేస్తున్నటువంటి స్టార్ డాటర్ మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే ఈమెకు నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో అవకాశం వచ్చిందట కానీ తాను ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం సమంత అంటూ మరొక వార్త వైరల్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సమంతకు మంచి స్నేహితురాలు నాగచైతన్య తనను బాధపెట్టి తనకు విడాకులు ఇచ్చి తన జీవితంతో ఆడుకున్నారు అన్న కోపంతోనే ఈమె తనకు కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చిన నాగచైతన్య సినిమాలలో నటించను అంటూ ఖరాఖండిగా చెప్పేసారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: నేను చనిపోయిన రోజున నా కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూస్తా: ఎన్టీఆర్

ట్రెండింగ్ వార్తలు