వర్షా బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ తో లవ్ లో ఉందంటూ వార్తలు.. ఆమె రియాక్షన్ ఇదే?

February 8, 2024

వర్షా బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ తో లవ్ లో ఉందంటూ వార్తలు.. ఆమె రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్య థాపర్ వర్షా బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా చిత్రం బృందం ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష వల్లమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఊరు పేరు భైరవకోన సినిమాలో నేను ట్రైబల్‌ అమ్మాయి భూమి పాత్రలో కనిపిస్తాను. తన ఊర్లో చదువుకున్న అమ్మాయి ఒక్క భూమి మాత్రమే. అందంగా, అమయాకంగా కనిపించే ఈ పాత్రలో స్ట్రెంత్, పవర్‌ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న సందేశం కూడా నా పాత్రతోనే వస్తుంది. నా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌కు భూమి పాత్ర కాస్త దగ్గరగా అనిపించింది. వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అలా ఎలా ఆలోచించి కథలు రెడీ చేస్తారు? అనుకున్నాను. కథ అంత బాగా అనిపించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్నాను.

తెలుగులో ఒక కొత్త ప్రాజెక్ట్‌ సైన్‌ చేశాను అని తెలిపింది వర్షా బల్లమ్మ. అనంతరం టాలీవుడ్ హీరో బెల్లంకొండ గణేశ్‌తో ప్రేమ వార్తలపై స్పందిస్తూ.. బెల్లంకొండ గణేష్ తో నేను ప్రేమలో ఉన్నాను అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని చెప్పుకొచ్చింది వర్షా. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గత కొద్ది రోజులుగా వర్షా బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ మధ్య ఏదో ఉందని వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వార్తలకు ఆమె చెక్ పెట్టేసింది.

Read More: యాత్ర 2 సినిమా ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు