ఓటీటీలో నేరుగా విడుదల కాబోతున్న విద్యావాసుల అహం.. ఎక్కడంటే?

May 7, 2024

ఓటీటీలో నేరుగా విడుదల కాబోతున్న విద్యావాసుల అహం.. ఎక్కడంటే?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో చిన్న సినిమాలన్నీ కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలలో విడుదలవుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే త్వరలోనే మరో సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం విద్యావాసుల అహం.

ఈ సినిమా నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఆహాలో విడుదల కానుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది పెళ్లి చేసుకున్నటువంటి జంట మధ్య కేవలం అహం కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తనికెళ్ల భరణి వంటి వారందరూ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల శివాని రాజశేఖర్ కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత విద్యావాసుల అహం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read More: ఆర్య సినిమాకు 20 ఏళ్లు.. గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన దిల్ రాజు!

Related News

ట్రెండింగ్ వార్తలు