May 7, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదటి నుంచి ఇప్పటివరకు సినిమాల పట్ల అదే డెడికేషన్ చూపిస్తూ తన అద్భుతమైనటువంటి నటనను కనబరుస్తున్నారు. ఇలా సినిమా కోసం ఈయన పడే తపన ఈయన చూపించే ఆసక్తి తనని ఉత్తమ జాతీయ నటుడిగా గుర్తింపు వచ్చేలా చేసిందని చెప్పాలి.
ఇలా జాతీయస్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా కూడా ఈయన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి అల్లు అర్జున్ సినీ కెరియర్లో ఆర్య సినిమా ఓ మైలురాయి వంటిది అని చెప్పాలి. గంగోత్రి సినిమాలో నటించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్ ఆర్య సినిమాతో అందరి చేత వావ్ అనిపించుకున్నారు.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా దూసుకుపోతున్నటువంటి అల్లు అర్జున్ విపరీతమైనటువంటి క్రేజ్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా విడుదలయ్యి సరిగా నేటికీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మే 7 వ తేది 2014తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో దిల్ రాజు చాలా గ్రాండ్ గా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది.
అల్లు అర్జున్ అనురాధ మెహతా హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది ఈ క్రమంలోని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇది మంచి వేదిక కానుందని దిల్ రాజు ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆర్య 2 సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Read More: ఈవారం థియేటర్ ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలు ఇవే!