కొత్త కథలతో సరికొత్త ప్రయాణం… రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా?

May 9, 2024

కొత్త కథలతో సరికొత్త ప్రయాణం… రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక ఈయన పుట్టినరోజు కావడంతో ఈయన సినిమాల నుంచి అప్డేట్స్ వెలబడబోతున్నాయి.

ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే మరో రెండు సినిమాలు కూడా ఇప్పటికే ఖరారు అయ్యాయి.

రవి కిరణ్ కోలా దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఒక యాక్షన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తిరిగి దిల్ రాజు నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో కూడా ఈయన మరో సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

అయితే సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా చెప్పుకో స్థాయిలో సక్సెస్ కాలేదనీ చెప్పాలి. ఈ క్రమంలోనే ఈయన సరికొత్త కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Read More: రీ రిలీజ్ కి సిద్ధమైన విక్రమ్ అపరిచితుడు.. విడుదల ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు