రీ రిలీజ్ కి సిద్ధమైన విక్రమ్ అపరిచితుడు.. విడుదల ఎప్పుడంటే?

May 9, 2024

రీ రిలీజ్ కి సిద్ధమైన విక్రమ్ అపరిచితుడు.. విడుదల ఎప్పుడంటే?

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో అయినటువంటి విక్రమ్ నటించిన సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. నటుడు విక్రమ్ ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే 2005వ సంవత్సరంలో ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించినటువంటి సూపర్ హిట్ చిత్రం అపరిచితుడు ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలలో విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో సదా హీరోయిన్గా నటించారు. 2005 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి ఈ సినిమా తిరిగి విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా మే 17వ తేదీ 2024 న తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్, నాజర్, కొచ్చిన్ హనీఫా, నేదురుమూడి వేణు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

Read More: ఓటీటీలోకి వచ్చేసిన ఆవేశం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు