థియేటర్స్‌లో కోబ్రా..ఎప్పుడంటే..!

July 3, 2022

థియేటర్స్‌లో కోబ్రా..ఎప్పుడంటే..!
దాదాపు పది పాత్రల్లో విలక్షణ నటుడు విక్రమ్‌ నటించిన ‘కోబ్రా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘కోబ్రా’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.‘కోబ్రా’ సినిమాను తెలుగులో ఎన్వీఆర్‌ సినిమాస్‌ రిలీజ్‌ చేస్తోంది. ఇక అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌ మృణాళిని రవి కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ‘కోబ్రా’ చిత్రంలో ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు.ఇక ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించడం మరో స్పెషల్‌ ఏట్రాక్షన్‌. ఇంటెన్స్‌ అండ్‌ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘కోబ్రా’ చిత్రం ఉండబోతుంది

ట్రెండింగ్ వార్తలు