పిల్లల్ని కనడం పై నటి సంచలన వ్యాఖ్యలు… దేవుడు కరుణించాలంటూ ఎమోషనల్ కామెంట్!

May 4, 2024

పిల్లల్ని కనడం పై నటి సంచలన వ్యాఖ్యలు… దేవుడు కరుణించాలంటూ ఎమోషనల్ కామెంట్!

పడ్డామండి ప్రేమలో మరీ అనే సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు వరుణ్ సందేశ్ నటి వితికా షేర్. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వీరిద్దరి జీవితంలో కూడా ప్రేమలో పడి అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ప్రస్తుతం కెరియర్ పరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.మరోవైపు వరుణ్ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఈ జంట పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాల అయినప్పటికీ ఇప్పటివరకు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు అనే విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. పిల్లల్ని తాము వద్దనుకోవడం లేదని ఈమె తెలిపారు.. 2016వ సంవత్సరంలో తాము అమెరికాలోనే సెటిల్ అవ్వాలని అక్కడికి వెళ్లిపోయాం ఆ సమయంలో మేము పిల్లల్ని ప్లాన్ చేయకుండానే తను కన్సివయ్యానని తెలిపారు.

ఇలా తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో వరుణ్ తన ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ అందరికీ చెప్పి సంబరాలు చేసుకున్నామని తెలిపారు. కానీ 40 రోజులకే తనకు అబార్షన్ అయిందని వెల్లడించారు. ఇక అమెరికా నుంచి ఇండియా వచ్చేసిన తర్వాత టూ మంత్స్ అయినా తనకి పీరియడ్స్ రాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తాను ప్రెగ్నెంట్ అని చెప్పగా షాక్ అయ్యామని వెల్లడించారు.

ఆ సమయంలో నేను జరిగినది మొత్తం చెప్పగా ఒకసారి టెస్ట్ లు చేయడంతో బేబీ పీస్ ఉండటం వల్ల తిరిగి తనకు సర్జరీ చేశారని తెలిపారు. అయితే తాము పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. దేవుడు కరుణిస్తే ఎవరు కూడా పిల్లల్ని వద్దనుకోరంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: రాఘవేంద్రరావుని పట్టుకొని క్రిస్మస్ తాత అంటూ కామెంట్ చేసిన స్వీటీ.. షాక్ లో డైరెక్టర్!

Related News

ట్రెండింగ్ వార్తలు