రాఘవేంద్రరావుని పట్టుకొని క్రిస్మస్ తాత అంటూ కామెంట్ చేసిన స్వీటీ.. షాక్ లో డైరెక్టర్!

May 4, 2024

రాఘవేంద్రరావుని పట్టుకొని క్రిస్మస్ తాత అంటూ కామెంట్ చేసిన స్వీటీ.. షాక్ లో డైరెక్టర్!

సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ రాఘవేంద్ర రావు సినీ కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన డైరెక్షన్లో నటించిన సెలెబ్రిటీలందరూ కూడా స్టార్ సెలబ్రెటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే రాఘవేంద్రరావు చూడటానికి ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు తెల్లటి గడ్డంతో కనిపిస్తూ ఉంటారు.

ఇలా రాఘవేంద్రరావు గెటప్ చూసినటువంటి స్టార్ హీరోయిన్ అనుష్క ఏకంగా క్రిస్మస్ తాత అంటూ కామెంట్లు చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనుష్క సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాలో సెలెక్ట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో నాగార్జున గారు తనని ఒక వ్యక్తికి పరిచయం చేయబోతున్నాను అంటూ పైకి తీసుకువెళ్లారట.

ఇలా మెట్లు ఎక్కుతూ ఉండగా పైనుంచి ఒక వ్యక్తి తెల్లటి డ్రెస్ వేసుకొని పొడవాటు గడ్డంతో కనిపించారట ఆయనని చూడగానే అనుష్కకి శాంటా క్లాస్ గుర్తుకు వచ్చారని తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఇలా రాఘవేంద్రరావు గారితో కలిసి పాల్గొన్నటువంటి ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క ఈ విషయాలను వెల్లడించారు.

ఇలా ఆయన గెటప్ చూసి తాను శాంటా క్లాస్ అనుకున్నాననే విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా రాఘవేంద్రరావు షాక్ అవుతూ తన నవ్వుతో కవర్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే రాఘవేంద్రరావు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నప్పటికీ ఈయన పర్యవేక్షణలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక అనుష్క సైతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు ఇటీవల కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినటువంటి అనుష్క తిరిగి తన ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

Read More: జూనియర్ ఎన్టీఆర్ పేరు అంటే బాలయ్యకు అంత కోపమా.. ఆ ఒక్కటే కారణమా?

ట్రెండింగ్ వార్తలు