ఒక్కరోజే పది చిత్రాల స్ట్రీమింగ్..ఓటీటీ లో వీకెండ్ జాతర!

March 29, 2024

ఒక్కరోజే పది చిత్రాల స్ట్రీమింగ్..ఓటీటీ లో వీకెండ్ జాతర!

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వీకెండ్ ఇది. చాలామంది పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేశారు. ఈ వారం థియేటర్లో కూడా పెద్దగా సినిమాలు విడుదల కాకపోవటంతో అందరి చూపు ఓటీటీలపై పడింది. ఏ సినిమాలు ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్ఫారం లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని తెగ వెతికేస్తున్నారు సినీ ప్రియులు.

వీరి బాధని అర్థం చేసుకున్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈ వీకెండ్ దాదాపు ఒక్క రోజే పది చిత్రాలని స్ట్రీమింగ్ కి తీసుకువస్తుంది. అయితే ఏ ఫ్లాట్ ఫామ్ లో ఏ మూవీ ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పాట్నా శుక్లా హిందీ సినిమా, మధు డాక్యుమెంటరీ , రెనెగడే నెల్ల్ వెబ్ సిరీస్, ద బ్యూటిఫుల్ గేమ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్, మస్తు సెట్స్ ఉన్నాయి రా టాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మై బుక్ షోలో ద హోల్డోవర్స్ హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్క్ వెబ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో ది బ్యూటిఫుల్ గేమ్ హాలీవుడ్ మూవీ, హార్ట్ ఆఫ్ ది హంటర్ హాలీవుడ్ మూవీ, ఇవన్నీ మార్చి 29న స్క్రీనింగ్ అవుతుండగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మాత్రం మార్చి 30న స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఒకేరోజు ఇన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ టాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి, అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమాల కోసం మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ ఈవారం థియేటర్లో రిలీజ్ అవుతుంది. దీంతోపాటు కలియుగం పట్టణంలో సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

Read More: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవర్ 171మూవీ.. టైటిల్, టీజర్ ఆ రోజే రిలీజ్!

Related News

ట్రెండింగ్ వార్తలు