లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవర్ 171మూవీ.. టైటిల్, టీజర్ ఆ రోజే రిలీజ్!

March 29, 2024

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవర్ 171మూవీ.. టైటిల్, టీజర్ ఆ రోజే రిలీజ్!

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్.ఇటీవలే విజయ్ తలపతి తో ఆయన తీసిన లియో సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమా చేస్తున్నాడు కనగరాజ్. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

ఈ మూవీ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లోకేష్ కనగరాజ్ తన ఎక్స్ వేదికగా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో రజనీకాంత్ లగ్జరీ వాచీలు దొంగతనం చేసే దొంగలా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో లగ్జరీ వాచ్లను బేడీలుగా చేతికి కట్టేసిన స్టిల్ లో 1980 ల నాటి వింటేజ్ తరహాలో రజనీకాంత్ లుక్ అదిరిపోయింది.

ఇక ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను ఏప్రిల్ 22వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు లోకేష్ తెలిపాడు. రజనీకాంత్ కెరియర్ లోనే సరికొత్తగా వస్తున్న ఈ సినిమాని లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా మ్యూజిక్ అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. శివ కార్తికేయన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ తలైవర్ 171 గురించి మాట్లాడుతూ ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది.

షూటింగ్ మొదలుపెట్టడానికి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్ లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు. తలైవర్ 171 వస్తున్న మూవీకి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రజినీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్.

Read More: బన్నీకి దక్కిన అరుదైన గౌరవం.. ఈరోజు చాలా ప్రత్యేకమైనదంటూ ఎమోషనల్ ట్వీట్!

ట్రెండింగ్ వార్తలు