ఓటీటీలోకి వచ్చేసిన ఆవేశం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

May 9, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ఆవేశం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలెంటెడ్ యాక్టర్ ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.జిత్తు మాధవన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ లు కీలక పాత్రల్లో నటించారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇక ఈ సినిమా అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఓటీటీ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నటువంటి తరుణంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం ఇతర భాషలలో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సూపర్ హిట్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినటువంటి వారు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక నటుడు పహద్ ఫాసిల్ ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Read More: ఎన్టీఆర్ కోసమే అలాంటి పని చేశాను.. కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు