ఎన్టీఆర్ కోసమే అలాంటి పని చేశాను.. కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్!

May 9, 2024

ఎన్టీఆర్ కోసమే అలాంటి పని చేశాను.. కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగులోకి ఈమె లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంత మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి కాజల్ పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు.

ఇలా కుమారుడు పుట్టిన తర్వాత తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె త్వరలోనే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాజల్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కొనసాగే సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈమె ఐటమ్ సాంగ్ కూడా చేశారు ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేశారు అయితే ఈ పాట గురించి అలీ ప్రశ్నించారు. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న మీరు ఇలా స్పెషల్ సాంగ్ చేయడానికి డైరెక్టర్ కారణమా లేక నిర్మాత కారణమా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కాజల్ అగర్వాల్ సమాధానం చెబుతూ కేవలం ఎన్టీఆర్ కోసం మాత్రమే నేను ఐటమ్ సాంగ్ చేశాను అంటూ ఈ సందర్భంగా కాజల్ తెలియజేశారు. ఇక ఈమె ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం, టెంపర్, బాద్ షా వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాలలో నటిస్తూ ఎన్టీఆర్ తో ఉన్నటువంటి సానిహిత్యం కారణంగానే ఆయన అడగడంతో స్పెషల్ సాంగ్ చేశానని తెలిపారు.

Read More: అదిరిపోయిన విజయ్ కొత్త మూవీ అప్డేట్.. యోధుడిగా కనిపించబోతున్న రౌడీ బాయ్?

ట్రెండింగ్ వార్తలు