బీఆర్ఎస్ నేత మృతి కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్.. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే అలా!

April 20, 2024

బీఆర్ఎస్ నేత మృతి కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్.. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే అలా!

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు కార్ ఢీ కొని బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాక్సిడెంట్ కేసులో నల్గొండ రెండో పట్టణ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ విషయం కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్‌పై విడుదలయ్యారు రఘుబాబు.

కాగా నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు BRS టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఆ సమయంలో రఘుబాబుతో కొంత మంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించుకుంటున్నారు. అయితే మృతుడు జనార్దన్ భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయనకి భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్దన్‌రావు కు టీఆర్ఎస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. మృతుడు రఘుబాబు కుటుంబానికి న్యాయం చేయాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Read More: ప్రభాస్ కల్కి మూవీ వాయిదా పడటానికి అసలు కారణం అదే? 

ట్రెండింగ్ వార్తలు