April 20, 2024
టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే. ఇటీవల సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కి మూవీ వాయిదా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.
కల్కి సినిమా వాయిదాకు కారణాలు ఏంటి అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కొందరు క్రికెట్ అంటూ కారణాలు చెబుతుండగా మరికొందరు ఎలక్షన్స్ అంటూ కారణాలు చెబుతున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో కారణాలు రెండు కాదు అంతకుమించి అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. కలిసొచ్చిన తేదీ కలెక్షన్లు కురిపించిన తేదీ అంటూ మే 9న కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మూవీ మేకర్స్. అయితే ఓ వైపు ఎన్నికలు, ఇంకోవైపు క్రికెట్ హడావిడి ఇన్నిటి మధ్య సినిమాను విడుదల చేయడం అవసరమా అని వాయిదా వేస్తున్నారన్నది వినిపిస్తున్న మాట.
అయితే కల్కికి సంబంధించి అంతకు మించి మరో విషయం ఇండస్ట్రీలో గుప్పుమంటోంది. కల్కి వాయిదా వేయడానికి ఇప్పుడు అనుకుంటున్న కారణాలన్నీ ఎటూ ఉండనే ఉన్నాయి. అయితే మేకర్స్ మనసుల్లో మెదులుతున్న ఏకైక రీజన్ పేరు టిక్కెట్ రేట్ల పెంపు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచుకుంటామని అడగానికి వెసులుబాటు లేదు. అలాగని ఉన్న రేట్ల మీద బొమ్మ పడితే పెద్దగా లాభాలు ఉండవు. రికార్డులు బ్రేక్ కావాలంటే, టిక్కెట్ రేట్ల పెంపు కంపల్సరీ. అందుకే ఎన్నికలు పూర్తయ్యాక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నది మేకర్స్ ఆలోచన. ఈ విషయాన్నే డిస్ట్రిబ్యూటర్లతోనూ చర్చిస్తారట. రిజల్ట్ లోపే సినిమాను రిలీజ్ చేయమని వారందరూ ముక్తకంఠంతో చెబితే, దానికైనా సరే అనాలని అనుకుంటున్నారట మేకర్స్.
Read More: ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్