August 23, 2022
చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్ చాలా కష్టాలను ఎదుర్కొన్నాకే ఒక స్టార్ స్టేటస్ ను అందుకొంటుంది. ఒకసారి స్టార్ స్టేటస్ అందుకున్నాక కొంతమంది వారి కష్టాలను బయటపెడతారు. బయటపెడుతుంటారు. అవి పెద్ద వివాదాలకు తావిస్తాయి. తాజాగా కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ తాను ఇండస్ట్రీలో పడిన బాధలను వివరించింది. ఇటీవలే కడవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మీడియాతో పంచుకొంది. ఒకానొక దశలో సినిమాలు మానేసే పరిస్థితి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యింది.
“కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ముఖ్యంగా పెద్ద హీరోలు, నాకన్నా వయసులో పెద్దవారైనా వారితో రొమాన్స్ చేసినప్పుడు ఎంతో ఇబ్బందిపడ్డాను. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. సక్సెస్ కోసం ఇంతగా పాకులాడుతున్నానా అని అనిపించింది. కానీ, వారితో నటించడం వలన ఎన్నో నేర్చుకున్నాను. ఇక చాలా సార్లు నిజజీవితానికి దూరంగా బతుకుతున్నానా..? అని అనిపించేది. ఎంతో మదనపడ్డాను. చాలాసార్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనిపించింది. ఇక ఆ సమయంలోనే మా నాన్నగారు మృతి చెందారు. ఎన్నో బయలు నన్ను వెంటాడాయి. కానీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డాను. పోరాడి ఇక్కడి వరకు వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఆమె సినిమాలో అవసరంలేకున్నా బట్టలులేకుండా నటించి విమర్శలందుకుంది. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి సొంత ప్రొడక్షన్ లో కడవర్ అనే సినిమాను రూపొందించింది. ఈ సినిమా హాట్‌స్టార్‌లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.