April 5, 2024
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమలాపాల్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఈమె తెలుగులో రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాలలో నటించారు. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె గతంలో తమిళ డైరెక్టర్ తో ప్రేమలో పడి ఆయనని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి. మనస్పర్ధలు కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయారు.
ఈ విధంగా భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయినటువంటి అమలాపాల్ తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే గత ఏడాది ఈమె నవంబర్ నెలలో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వివాహం జరిగినటువంటి కొద్ది రోజులకే తాను ప్రెగ్నెంట్ అనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఈమె ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడంతో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే అంత హడావిడిగా పెళ్లి చేసుకుందని చాలామంది ఈమె పెళ్లి గురించి కామెంట్లు చేశారు..
ఇలా ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి అమలాపాల్ ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు అయితే ఇటీవల ఈమె సంప్రదాయబద్ధంగా సీమంతపు వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది. తన భర్త జగత్ ఇంట్లో ఈ వేడుకలు జరిగాయని తెలుస్తుంది. తాజాగా ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోలలో భాగంగా వీరిద్దరూ వారి సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ అలాగే అభిమానులు ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవల ఈమె కవలలు జన్మించబోతున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే కవలలు జన్మిస్తున్నారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Read More: ఇంటి అద్దె కట్టలేక వీదిన పడ్డాము.. రష్మిక కష్టాలు మామూలుగా లేవు?