తగ్గుతున్న సుమ క్రేజ్.. ఆ సర్వేలో నాలుగో స్థానానికి పరిమితమైన సుమ?

February 19, 2024

తగ్గుతున్న సుమ క్రేజ్.. ఆ సర్వేలో నాలుగో స్థానానికి పరిమితమైన సుమ?

యాంకర్ సుమ పరిచయం అవసరం లేని పేరు గత రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుమ బుల్లితెర కార్యక్రమాలను తగ్గించి సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సుమ క్రేజ్ మెల్లి మెల్లగా తగ్గుతుందని తెలుస్తోంది. బుల్లితెరపై నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగే సుమ టాప్ ఫైవ్ లో నాలుగో స్థానానికి పడిపోయారు. ఈమె కంటే ముగ్గురు భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుని సుమను వెనక్కి నెట్టారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఆ ముగ్గురు ఎవరనే విషయానికి వస్తే.. ప్రముఖ సంస్థ ఆర్మాక్స్… మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది. ఈ సర్వే లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు మొదటిస్థానంలో ఉన్నాడు. ఈయన మేల్ యాంకర్ గా గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రదీప్ తర్వాత స్థానం బుల్లితెర కమెడియన్ వెండితెర హీరో సుడిగాలి సుదీర్ కైవసం చేసుకున్నారు. ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇక మూడో స్థానంలో హైపర్ ఆది నిలిచారు. బుల్లితెర కమెడియన్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆది ఈ సర్వేలో మూడో స్థానంలో నిలిచారు. ఇక నాలుగో స్థానంలో యాంకర్ సుమ ఉన్నారు.

మొదటి స్థానంలో ఉండే సుమ ఇలా నాలుగో స్థానానికి వెళ్లడంతో ఈమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఇకపోతే ఐదో స్థానంలో మరొక జబర్దస్త్ మాజీ కమెడియన్ చమ్మక్ చంద్ర ఉన్నారు. ఈయన బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ ఈ సర్వేలో మాత్రం చమ్మక్ చంద్ర ఐదో స్థానంలో నిలిచారు.

Read More: ఆ కారణంతోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. ఓపెన్ అయిన వరుణ్!

ట్రెండింగ్ వార్తలు