ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

March 12, 2024

ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లేడీ యాంకర్స్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మేల్  యాంకర్ గా ప్రదీప్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రదీప్ వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే ఈయన గతంలో 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ప్రదీప్ తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈయన మాత్రం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాల నుంచి కూడా తప్పకున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈయన బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ప్రదీప్ ఏం చేస్తున్నారన్న సందేహాలు అందరికీ కలగక మానదు. అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ప్రదీప్ భారీ స్థాయిలో కష్టపడడమే కాకుండా కండలు తిరిగిన శరీరాన్ని పెంచుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఈయన కష్టం చూస్తుంటే మాత్రం ఏదో సినిమా కోసమే భారీగా కష్టపడుతున్నారని తెలుస్తోంది.

ఇలా ఇప్పటికే ఒక సినిమా ద్వారా హీరోగా వచ్చినటువంటి ప్రదీప్ త్వరలోనే మరో సినిమా ద్వారా రాబోతున్నారని ఈయన తన సినిమా పనులలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారని ఈ వీడియో బట్టి చూస్తేనే తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో రాబోతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More : ఈమధ్య ఆ పిచ్చి మరింత ముదురుతుంది..

ట్రెండింగ్ వార్తలు