అనుష్క చేసిన ఆ తప్పే కెరీర్ కు మైనస్ అయిందా?

February 8, 2024

అనుష్క చేసిన ఆ తప్పే కెరీర్ కు మైనస్ అయిందా?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుష్క అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక అరుంధతి సినిమా మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి.

ఇలా లేడి ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ లో ఎంతో బిజీగా ఉండే ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన అనుష్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.

ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె కన్నడ మలయాళం చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల కోసం ఎలాంటి సాహసమైన చేసే అనుష్క తన కెరియర్ ఇప్పుడు ఇలా ఉండడానికి తను చేసిన తప్పే కారణమని పెద్ద ఎత్తున అభిమానులు ఈమె పట్ల కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా అనుష్కకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఈమె వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించి మొహానికి మాస్క్ వేసుకొని కారులో నుంచి దిగి ఎక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళిపోయారు ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువురు ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా మీడియాకు కూడా కనపడకుండా అనుష్క మొహం దాచుకొని మరీ వెళ్లిపోవడానికి కారణం ఆమె చేసిన తప్పేనని పలువురు భావిస్తున్నారు.

అనుష్క సైజ్ జీరో సినిమా కోసం అధిక శరీర బరువు పెరిగింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి నేచురల్ గా బరువు పెరిగినటువంటి అనుష్క ఈ సినిమా తర్వాత శరీర బరువు తగ్గాలనే ప్రయత్నాలు చేసిన అది సాధ్యం కాలేదు దీంతో ఈమె ఇప్పటికీ బొద్దుగా ఉండటంవల్లే అలా మొహం దాచుకొని మరి వెళ్ళిపోతున్నారని ఈ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే ఈమె కెరియర్ ఎక్కడో ఉండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read More: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ వాయిదా.. ఆ స్థానంలో మరో సినిమా?

ట్రెండింగ్ వార్తలు