గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ వాయిదా.. ఆ స్థానంలో మరో సినిమా?

February 8, 2024

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ వాయిదా.. ఆ స్థానంలో మరో సినిమా?

టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విశ్వక్‌సేన్‌. ఇప్పటివరకు విశ్వక్‌సేన్‌ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తున్నారు విశ్వక్‌సేన్‌. ఇకపోతే విశ్వక్‌సేన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 8వ తేదీన విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మరొకసారి వాయిదా వేశారు మూవీ మేకర్స్. అయితే ఇక్కడ దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే అదే తేదీకి మరొక సినిమాను విడుదల చేస్తున్నారు. విశ్వక్‌సేన్‌ అఘోరా పాత్రలో నటించిన గామి సినిమాను అదే తేదీకి విడుదల చేయనున్నారు. దాదాపుగా నాలుగున్నర ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈ సినిమాను ఎట్టకేలకు థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. కొత్త దర్శకుడు విద్యాధర్‌ ఈ మూవీని తెరకెక్కించారు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. కాగా తాజాగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి విడుదల తేదీ ప్రకటించింది.

ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపింది. అదే రోజు విడుదల కావాల్సిన తన మరో చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి తర్వాత వస్తుందని తెలిపారు హీరో విశ్వక్‌సేన్‌. అయితే గతంలో నేను నటించిన ఫలక్‌నుమా దాస్‌ సినిమా విడుదలకు ముందే గామి పనులు ప్రారంభమయ్యాయి. దర్శకుడు కథ మొత్తాన్ని నాతో బలవంతంగా చదివించాడు. ఈ స్టోరీతో నాలుగున్నరేళ్లు ప్రయాణం చేశాము. ఇంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనుకున్న స్థాయిలో వచ్చాయి. ట్రైలర్‌ అదిరిపోయింది. మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఉన్నాను. సినిమా మారినా నేను మార్చి 8న మీ ముందుకురావడం పక్కా. ఈ చిత్రం రెడీగా ఉంది. అందుకే ఆ రోజున విడుదల చేయబోతున్నాం. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి పనులు పెండింగ్‌లో ఉన్నాయి అని తెలిపారు విశ్వక్ సేన్.

Read More: వర్షా బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ తో లవ్ లో ఉందంటూ వార్తలు.. ఆమె రియాక్షన్ ఇదే?

ట్రెండింగ్ వార్తలు