దేశ‌వ్యాప్తంగా `ఆంటీ` ట్రెండింగ్‌…ఆ యాంక‌రే కార‌ణ‌మా?

August 27, 2022

దేశ‌వ్యాప్తంగా `ఆంటీ` ట్రెండింగ్‌…ఆ యాంక‌రే కార‌ణ‌మా?

ఉన్నట్లుండి సోష‌ల్ మీడియా అంతా..ఆంటీ..ఆంటీ అంటూ గోల పెడుతోంది. ఎక్కడెక్కడి వీడియోల మీద ‘ఆంటీ..ఆంటీ’ అనే ఓవర్ లాప్ వాయిస్ లు వినిపిస్తున్నాయి. మీమ్ పేజిల్లో ఆంటీ…ఆంటీ అంటూ కొత్త కొత్త మీమ్స్ ద‌ర్శ‌న‌ మిస్తున్నాయి. ఇదంత ఎందుకు జ‌రుగుతోందో సోష‌ల్‌ మీడియాను కాస్త క్లోజ్ గా ఫాలో అయ్యే ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.

మొన్న పేరు ప్ర‌స్తావించ‌కుండా ఒక‌ సినిమాపై యాంక‌ర్ అన‌సూయ‌ వేసిన ట్వీట్ దీనంత‌టికీ కార‌ణం. ఆ గొడ‌వ చినికి చినికి గాలిదుమారంలా మారింది. ఆంటీ..ఆంటీ అంటూ తనను ఏజ్ షేమింగ్ చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటా అని అన‌సూయ అనడంతో మరింత రెచ్చిపోయారు ఆ హీరో ఫ్యాన్స్‌. నిన్నటి నుంచి ఆమె యాంటీ.. ఆంటీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీట్ ల వార్ నడుస్తూనే వుంది. ఈ మధ్యలో దూరిన న‌టి శ్రద్దాదాస్ ను కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీంతో ఈ గొడ‌వ‌లో ఎవ‌రైనా త‌ల‌ దూర్చాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అనసూయ ట్వీట్ పెట్టిన తరువాత అలా వదిలేసి వుంటే సరిపోయేది. లేదా తనను ట్రొల్ చేసిన వారిని బ్లాక్ చేసుకున్నా పోయేది. అలా కాకుండా వ్యవహారం ‘ఆంటీ’ వైపు తిరగడంతో సోష‌ల్ మీడియా బ్యాచ్ హడావుడికి హద్దులేకుండా పోయింది. ఇప్పుడు ఆంటీ అనే హ్యాష్‌ట్యాగ్ దేశ‌మంత‌టా ట్రెండ్ అవుతోంది. సాయంత్రానికి ఇది మ‌రింత ముదిరే ప్ర‌మాదం ఉంది. మ‌రి చూడాలి దీనిపై సైబ‌ర్ యాక్ష‌న్ టీమ్‌, అన‌సూయ టీమ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో..

ట్రెండింగ్ వార్తలు