కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన బర్రెలక్క.. వైరల్ అవుతున్న ఫ్రీ వెడ్డింగ్ షూట్?

March 25, 2024

కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన బర్రెలక్క.. వైరల్ అవుతున్న ఫ్రీ వెడ్డింగ్ షూట్?

బర్రెలక్క ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. తాను డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకుంటూ ఉన్నాను అంటూ ఈమె సోషల్ మీడియా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అప్పటినుంచి ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు. ఇకపోతే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈమె తన నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికలలో ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే.

ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈమె ఓటమి కావడంతో తిరిగి త్వరలో జరగబోయే ఎన్నికలలో తాను ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేయబోతున్నాను అంటూ బర్రె లక్క వెల్లడించారు ఇదిలా ఉండగా ఇటీవల ఈమె తన పెళ్లి గురించి అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఈమె తెలియజేశారు.

ఇలా పెళ్లి చేసుకోబోతున్నానని తెలియజేయడమే కాకుండా తన నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో ని కూడా షేర్ చేశారు. అనుకోకుండా సడన్ గా జరిగిపోయిందని ఈమె తెలిపారు. ఇక ప్రస్తుతం తన పెళ్లి పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల 28వ తేదీ బర్రెలక్క వెంకటేష్ అనే వ్యక్తితో కలిసి ఏడడుగులు నడవబోతున్నారని సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా తనకు కాబోయే భర్తను ఈమె రివిల్ చేశారు. ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కాబోయే భర్త పేరు వెంకటేష్ అని తమ పెళ్లి మార్చ్ 28వ తేదీ జరగబోతుందని తెలియజేశారు. ఇక వెంకటేష్ తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆయన ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారని ఈమె వెల్లడించారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Read More: సూపర్ హిట్ సినిమాకు నో చెప్పిన సూర్య చెల్లెలు.. మంచి ఛాన్స్ మిస్సయిందిగా?

ట్రెండింగ్ వార్తలు