ఘనంగా బర్రెలక్క వివాహం.. వైరల్ అవుతున్న వీడియో!

March 28, 2024

ఘనంగా బర్రెలక్క వివాహం.. వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ రీల్స్ చేస్తూ ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష ఒకరు. ఈమె ఉద్యోగం లేక బర్రెలు కాసుకుంటూ ఉన్నాను అంటూ ఒక వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో పాపులర్ అయింది ఇక ఈ వీడియో మంచి క్రేజ్ రావడంతో అనంతరం ఈమె వరుస వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ వచ్చారు.

ఇలా సోషల్ మీడియాలో తనకు మంచి పాపులారిటీ రావడంతో ఈమె ఏకంగా గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఈమె పేరు ఒక్కసారిగా మారు మోగిపోయింది కానీ ఈమె విజయం సాధించలేకపోయింది.

ఇలా ఎన్నికలలో ఓడిపోయినటువంటి బర్రెలక్క సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ ఉన్నారు. అయితే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా తాను పోటీ చేస్తున్నాను అంటూ ఈమె గట్టిగానే చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బర్రెలక్క వివాహం అంటూ ఒక శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు అయితే ఈమె వివాహం నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

వెంకటేష్ అని వ్యక్తితో ఈమె వివాహం జరగబోతుందని ఈమె తెలియజేశారు అంతేకాకుండా వీరి పెళ్లికి ముందు జరిగినటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేశారు. ఇలా తన పెళ్లికి సంబంధించిన వివరాలను పెళ్లి వేడుకలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె పెళ్లికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదని వచ్చే ఎంపీ ఎన్నికలలో కూడా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఇక తన భర్తకి కూడా రాజకీయాలు అంటే చాలా ఆసక్తి ఉందని ఈ సందర్భంగా బర్రెలక్క అలియాస్ శిరీష చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: Aadu Jeevitham Twitter Review: ఆడు జీవితం సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు.. పదహారేళ్ల కష్టానికి ప్రతిఫలం అంటున్న హీరో!

ట్రెండింగ్ వార్తలు