విడుదల తేదీ లాక్ చేసుకున్న భజే వాయువేగం.. ఎప్పుడంటే?

May 9, 2024

విడుదల తేదీ లాక్ చేసుకున్న భజే వాయువేగం.. ఎప్పుడంటే?

వేసవికాలం మొదలవడంతో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఊహించారు కానీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు కూడా వెనకడుగు వేసాయి. ఇలా ఎన్నికల హడావుడి కనుక లేకపోతే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇలా ఎన్నికల హడావిడి కావడంతో కేవలం చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ క్రమంలోని సినీ నటుడు కార్తికేయ హీరోగా నటించిన భలే వాయువేగం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల కాలంలో కార్తికేయ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే భలే వాయువేగం సినిమాపై భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేశారు.

భజే వాయువేగం సినిమాని ఈనెల 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు బుధవారం సినీ బృందం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇకపోతే నేడు ఈ సినిమా నుంచి సెట్ అయ్యిందే పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. యు వి క్రియేషన్స్ సమర్పణలో యు వి కాన్సెప్ట్ సమస్త నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాను ప్రశాంత్ రెడ్డి చంద్రపూర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హ్యాపీడేస్ ఫేమ్ టైసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా బాబోద్వేగాలతో కూడిన యాక్షన్ చిత్రమని తెలియజేశారు. ఇక ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య కొనసాగే నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ద్వారా అయిన కార్తికేయ మంచి హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read More: కొత్త కథలతో సరికొత్త ప్రయాణం… రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా?

ట్రెండింగ్ వార్తలు