భలే కవర్ చేసిందే.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ వైరల్

December 30, 2023

భలే కవర్ చేసిందే.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ వైరల్

సాక్షి అగర్వాల్(Sakshi Agarwal) పరిచయం అవసరం లేని పేరు ఈమె సౌత్ ఇండస్ట్రీలో నటిగా మోడల్ గా కొనసాగుతూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరియర్ మొదట్లో మోడల్ గా పరిచయమైనటువంటి ఈమె పలు తమిళ కన్నడ మలయాళ సినిమాలలో నటించారు. అనంతరం తమిళంలో ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇలా తమిళ సీజన్ 3 బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో అలాగే బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సాక్షి అగర్వాల్(Sakshi Agarwal) సందడి చేస్తూ వచ్చారు. ఇక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక మరొక రోజులో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో సెలబ్రిటీలు అందరు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

ఎంతోమంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాక్షి అగర్వాల్ సైతం వెకేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈమె వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారని తెలుస్తుంది. ఇక్కడ సముద్రపు అందాలను చూస్తూ నారింజ రంగు బికినీలో ఈమె తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారింజ రంగు బికినీలో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి ఈమె నీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా నీటిలో అలజడిని సృష్టించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా తన ప్రతిబింబం నీటిలో కనపడకుండా ఈమె భారీగానే కవర్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ ఈ ఫోటోలపై కామెంట్ చేస్తూ.. భలే అద్భుతంగా కవర్ చేసారు అంటూ ఈ బ్యూటీ హాట్ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట అవుతున్నాయి.

Read More: కావ్య థాపర్ స్తున్నింగ్ ఫొటోస్

ట్రెండింగ్ వార్తలు