బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ బ్యూటీ?

February 1, 2024

బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ బ్యూటీ?

ఇటీవలే భగవంత్ కేసరితో హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.

ఈ సినిమా ప్రస్తుతం NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో నటించబోతుందంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇదే విషయాన్ని ఆ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఊర్వశీ రౌతెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇటీవల చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ చిందులు వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా బాబి దర్శకత్వం వహించటం విశేషం అయితే ప్రస్తుతం బాలయ్య సినిమాలో కూడా ఊర్వశికి కీలకపాత్ర ఇచ్చారని తెలుస్తోంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఊర్వశి బాలకృష్ణ సినిమాలో తాను నటిస్తున్నటువంటి పాత్ర గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాత్రలో నటించడం కోసం ఈమె ప్రత్యేకంగా ట్రైనర్ సహాయంతో ఆ పాత్రకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం తన ట్రైనర్ తో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నారు. అలాగే మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Read MoreJai Hanuman: హ‌నుమాన్‌కి నో చెప్పిన హీరో ఎవ‌రో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు