థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన వరుణ్ సందేశ్ చిత్రం చూడరా మూవీ!

May 7, 2024

థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన వరుణ్ సందేశ్ చిత్రం చూడరా మూవీ!

విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో వరుణ్ సందేశ్ ముందు వరుసలో ఉంటారు. ఈయన హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా తెలుగులో పలు సినిమా అవకాశాలను అందుకుంటు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరుణ్ సందేశ్ ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.

ఇలా కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సరికొత్త కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలోనే చిత్రం చూడరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ విడుదల కానుంది అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. మే 9 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్, ధనరాజ్ మరియు కాశీ విశ్వనాథ్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నట్లు చూపించారు. ఈ క్రైమ్ డ్రామాలో అదితి గౌతమ్, రవిబాబు కీలక పాత్రలలో నటించబోతున్నారు చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి వరుణ్ సందేశ్ చిత్రం చూడరా సినిమా ద్వారా సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read More: ఓటీటీలో నేరుగా విడుదల కాబోతున్న విద్యావాసుల అహం.. ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు