హైపర్ ఆదికి ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి ఆ దోషమే కారణమా?

February 26, 2024

హైపర్ ఆదికి ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి ఆ దోషమే కారణమా?

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఒకవైపు బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీతో పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా మరోవైపు వెండితెర సినిమాల అవకాశాలను కూడా అందుకుంటూ కమెడియన్ గా దూసుకుపోతున్నారు.

ఇలా హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈయన ఏ కార్యక్రమంలో పాల్గొన్న తరచూ తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈయన పెళ్లి వయసు దాటిపోతున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడంతో తన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ఈయన పెళ్లి బట్టలలో వచ్చి మరి తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పటివరకు తనకు పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలను తాగుబోతు రమేష్ ద్వారా చెప్పించారు. హైపర్ ఆదికి ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆయన జాతకంలో ఉన్న దోషమే కారణమని తెలుస్తుంది. ఈయన జాతకంలో ఉన్న దోషం పోయి పెళ్లి జరగాలి అంటే ముందుగా తనకు ఒక వృద్ధురాలితో పెళ్లి జరగాలని చెప్పారు.

ఈ విధంగా జాతకంలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడం కోసం తనని పెళ్లి చేసుకోవడానికి కొంతమంది వృద్ధ మహిళలను తీసుకువచ్చిన వాళ్లు కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలియజేశారు. ఈ విధంగా హైపర్ ఆది పెళ్లి చేసుకోకపోవడానికి జాతక దోషమే కారణమంటూ తాగుబోతు రమేష్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా స్కిట్ లో బాగామని తెలుస్తోంది. మరి నిజజీవితంలో ఈయన ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయాలు మాత్రం అది ఎప్పుడు ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు.

Read More: రిప్లై ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా… రష్మికను బెదిరించిన అభిమాని?

ట్రెండింగ్ వార్తలు