ఊరి పేరు భైరవకోన వాయిదా ప‌డ‌నుందా..ఫిలిం ఛాంబ‌ర్ ప్ర‌తిపాద‌న ఏంటి?

January 26, 2024

ఊరి పేరు భైరవకోన వాయిదా ప‌డ‌నుందా..ఫిలిం ఛాంబ‌ర్ ప్ర‌తిపాద‌న ఏంటి?

సంక్రాంతి సినిమాల విష‌యంలో ఎంత రాద్దాతం జ‌రిగిందో అంద‌రికీ తెలిసింది. మేం త‌ప్పుకోం అంటే మేం త‌ప్పుకోం అని సీనియ‌ర్ హీరోలు భీష్మించుకు కూర్చున్నారు. దాంతో ఫిలిం ఛాంబ‌ర్ క‌ల‌గ‌జేసుకుని సంక్రాంతి భ‌రి నుండి ర‌వితేజ ఈగ‌ల్ సినిమాను విజ‌య‌వంతంగా త‌ప్పించ‌ గ‌లిగింది. అయితే అంత‌టితో పంచాయితీ అయిపోలేదు..సంక్రాంతి నుండి త‌ప్పుకుంటే జ‌న‌వ‌రి 26 లేదా ఫిబ్ర‌వ‌రి 9న సోలో రిలీజ్ డేట్ ఇస్తాం అని హామీ ఇచ్చింది. మ‌హా శివ‌రాత్రి క‌లిసి వ‌స్తుండ‌డంతో ఫిబ్ర‌వ‌రి 9నే ఎంచుకుంది చిత్ర యూనిట్‌.. ఇంత వ‌ర‌కూ బాగానే న‌డిచింది..కానీ ఇప్పుడు చ‌డీ చ‌ప్పుడు కాకుండా ఊరు పేరు భైర‌వ‌కోన కూడా ఫిబ్ర‌వ‌రి 9 రిలీజ్ డేట్ వేసింది. దాంతో మ‌ళ్లీ రిలీజ్ డేట్ల వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఫిబ్ర‌వ‌రి 9న మ‌రో రెండు సినిమాలు ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్ గా చెప్పుకునే యాత్ర‌-2, రజ‌నీకాంత్ లాల్ సలామ్ వ‌స్తున్న‌ప్ప‌టికీ వాటితో ఈగ‌ల్ సినిమాకేం న‌ష్టం లేదు..అందుకే వారు రిలీజ్ డేట్స్ వేసిన‌ప్పుడు కూడా నోరు మొద‌ప‌ లేదు..కానీ ఊరు పేరు భైర‌వ‌కోన కంటెంట్ కొంచెం కొత్త‌గా ఉండ‌డంతో పున‌రాలోచ‌న‌లో ప‌డి మాకు మాట ఇచ్చిన‌ట్టుగా సోలో రిలీజ్ డేట్ ఇవ్వాల్సిందిగా ఫిలిం ఛాంబ‌ర్‌కి బహిరంగ లేఖ ద్వారా తెలిపింది చిత్ర యూనిట్‌.

దీంతో మండలి పెద్దలు ఈ విషయమై ఇటీవ‌ల సమావేశం నిర్వహించారు. కానీ ఊరి పేరు భైరవకోన చిత్ర బృందం మాత్రం ఫిబ్రవరి 9నే రావాలని పట్టుబట్టి ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్లను కన్విన్స్ చేయడానికి నిర్మాతల మండలి కొత్త ప్రతి పాదన చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వారం రోజులు వాయిదా వేసుకుంటే దానికి సోలో రిలీజ్ డేట్ దక్కేలా చూస్తా మని హామీ ఇచ్చార‌ట‌. అయితే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ సినిమా `భీమా` సినిమాలు ఫిబ్ర‌వ‌రి 16న రావాల్సి ఉన్నాయి. అయితే ఆ రెండు చిత్రాలు కూడా వాయిదా పడే సూచనలు ఉండడంతో..ఆ రోజు మరే మరే సినిమా రాకుండా చూస్తామని ఫిబ్రవరి 9న ఖాళీ చేయాలని ఊరి పేరు భైరవకోన టీంను కోరినట్లు సమాచారం. మరి ఈ ప్రతిపాదన కు ఆ చిత్ర బృందం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Read Moreమాట నిల‌బెట్టుకుంటున్న ప్ర‌భాస్..ఖుషీలో ఫ్యాన్స్‌  

ట్రెండింగ్ వార్తలు