ఊరి పేరు భైరవకోన సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

March 9, 2024

ఊరి పేరు భైరవకోన సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ఊరి పేరు భైరవకోన. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లుగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకోవటంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సంపాదించింది. ఆరంభంలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ తర్వాత ఆ జోరుని కొనసాగించలేకపోయింది.

అయితే ఈ సినిమాని వెండి తెరమీద మిస్సయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. మార్చి 8 మహాశివరాత్రి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందంతో పాటు ప్రైమ్ వీడియో కూడా సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. అంటూ ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్ లో బాగానే థ్రిల్ పంచింది.

సినిమా కథ విషయానికి వస్తే భైరవకోన ఒక మార్మిక ప్రపంచం. కేవలం కార్తీకమాసంలో రాత్రివేళ మాత్రమే ఊరు తలుపులు తెరుచుకుంటాయి. అందులోకి ప్రవేశించిన వాళ్ళే తప్ప ప్రాణాలతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు.అయితే ఒక రోజు పెళ్లి నుంచి తప్పించుకొని వస్తున్న బసవ ( సందీప్ కిషన్), తన ఫ్రెండ్ జాన్ ( వైవా హర్ష ),అగ్రహారం గీత ( కావ్య థాపర్) ఆ ఊరిలోకి వెళ్తారు తర్వాత ఏమైంది?

భైరవకోనలో బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే సినిమా కథ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో కూడా చూడటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవిశంకర్ లు కీలక పాత్రలలో నటించారు. అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మించగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

Read More :   హనుమాన్ సినిమాని ఓటీటీ లో కన్నా ముందే టీవీలో చూడొచ్చు.. ఎప్పుడు, ఎక్కడంటే?

 

ట్రెండింగ్ వార్తలు