August 29, 2022
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 16 వ రోజు ఆదివారం కావడంతో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం : 11.51 కోట్లు సీడెడ్ : 4.38 కోట్లు ఉత్తరాంధ్ర : 3.97 కోట్లు ఈస్ట్ : 2.32 కోట్లు వెస్ట్ : 1.51 కోట్లు గుంటూరు : 2.43 కోట్లు కృష్ణా : 1.96 కోట్లు నెల్లూరు : 0.93 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ : 29.01 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.52 కోట్లు ఓవర్సీస్ : 5.55 కోట్లు హిందీ : 11.33 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 48.41 కోట్లు (షేర్)
‘కార్తికేయ 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 16 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.48.41 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిన్న కూడా ఈ చిత్రం రూ.2 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది.