బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్.. 15 డేస్ కలెక్షన్ వివరాలివే?

April 13, 2024

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్.. 15 డేస్ కలెక్షన్ వివరాలివే?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. ఇందులో అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. టిల్లు స్క్వేర్ సినిమాతో సెన్సేషన్ ను క్రియేట్ చేశాడు సిద్దు జొన్నలగడ్డ ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

అచ్చు, రామ్ మిరియాల, భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ సినిమా 15 డేస్ కలెక్షన్స్ విషయానికి వస్తే..టిల్లు స్క్వేర్ కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక 15వ రోజు ఎంత వచ్చింది? అన్న విషయానికి వస్తే..

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు రెండు వారాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, 15వ రోజు వర్కింగ్ డే కావడంతో కాస్త డౌన్ అయింది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో ఈ చిత్రం రూ. 80 లక్షలు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1 కోటి వసూలు చేసింది. ఇలా 15 రోజుల్లోనే ఈ మూవీ రూ. 62.60 కోట్లు కలెక్ట్ చేసింది.

https://telugu.chitraseema.org/chiranjeevis-dream-to-watch-cherry-and-janhvi-kapoor-on-big-screen/

ట్రెండింగ్ వార్తలు