March 11, 2024
సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నటుడు కిరణ్ అబ్బవరం సైతం రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈయన తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యతో నిశ్చితార్థం జరుపుకున్నారు. కిరణ్ అబ్బవరం రహస్యతో గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరూ పలు సందర్భాలలో బయటపడిన ఈ విషయాన్ని మాత్రం కిరణ్ అబ్బవరం ఎక్కడ ప్రకటించలేదు.
కిరణ్ అబ్బవరం రాజావారు రాణి వారు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ చిత్రంతోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదటి చిత్రంతోనే ఇటు సినీ కెరీర్, అటు పర్సనల్ కెరీర్ సెట్ అయింది. ఆ చిత్రంలోని హీరోయిన్ రహస్య గోరక్‌తో కిరణ్ అబ్బవరం రహస్యంగా ప్రేమాయణం చేశారు. ఇలా వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఖండించే ప్రయత్నం చేయలేదు.
ఇటీవల తన సొంత పట్టణంలో కిరణ్ అబ్బవరం నూతన గృహ ప్రవేశ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో కూడా రహస్య పాల్గొనడంతో అందరికీ అనుమానాలు బలపడ్డాయి. అయితే గత బుధవారం ఈయన రహస్యతో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమాయణం గడిపిన ఈయన ఒక్కసారిగా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. మొత్తానికి తన హీరోయిన్ నే కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read More : నాన్న సినిమాలలో నటించిన.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆకాష్ పూరి?