ఆరేళ్ల ప్రేమ ప్రయాణం పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రహస్య!

March 15, 2024

ఆరేళ్ల ప్రేమ ప్రయాణం పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రహస్య!

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ తో హైదరాబాదులో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చి 13వ తేదీ వీరి నిశ్చితార్థపు వేడుకలు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ గా మారడంతో వీరి ప్రేమ గురించి పలువురు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రాజావారు రాణి గారు అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత రహస్య సినిమాలకు దూరమయ్యారు. కానీ కిరణ్ మాత్రం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇలా ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అయితే వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు అయితే తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. తర్వాత రహస్య ఈ నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి ప్రేమ ప్రయాణం గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

గత ఆరు సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు మనం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాము, ప్రేమలో పడ్డాము. ఎన్నో ఊసులు చెప్పుకున్నాము అనుకోకుండా ట్రిప్స్ వెళ్ళాము. ఎన్నో ఎత్తు పల్లాలను చూసాము ఏది ఏమైనా మనది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలో నీతో కలిసి ముందుకు నడవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నా సర్వస్వం కిరణ్ అంటూ ఈ సందర్భంగా ఈమె తన ప్రేమ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read More: వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో అజిత్..

ట్రెండింగ్ వార్తలు