రాబిన్ హుడ్‌గా నితిన్‌..ఈ సారైనా హిట్ ద‌క్కేనా?

January 25, 2024

రాబిన్ హుడ్‌గా నితిన్‌..ఈ సారైనా హిట్ ద‌క్కేనా?

హీరో నితిన్‌కి హిట్టుప‌డి చాలా కాల‌మే అయింది. రీసెంట్‌గా విడుద‌లైన ఎక్స్‌ట్రాఆర్డిన‌రీమేన్ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు నితిన్.. కానీ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. దాంతో మ‌రోసారి స్క్రిప్టుల‌ ప‌రిశీల‌న‌లో ప‌డ్డాడు నితిన్‌..

ప్ర‌స్తుతం నితిన్ ఆశ‌లు అన్నీ త‌న‌కు భీష్మ‌తో త‌న‌కు విజ‌యాన్ని అందించిన వెంకీ కుడుముల మీద పెట్టుకున్నాడు. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. జి. వి. ప్రకాష్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు.. నితిన్, ఇలియాన జంట‌గా న‌టించిన రెచ్చిపో సినిమాని హిందీలో ఆజ్ కా రాబిన్ హుడ్ అనే పేరుతో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు.. ఇప్పుడు ఆ టైటిల్ క‌లిసి వ‌చ్చేలా రాబిన్ హుడ్ అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్మెంట్ జోన‌ర్‌కి కాస్త యాక్ష‌న్ ట‌చ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ రెడీ చేశారంట వెంకీ కుడుముల. ప్ర‌స్తుతం ఈ సినిమాపై గంపెడు ఆశ‌లు పెట్టుకున్నాడు నితిన్‌.. ఛ‌లో, భీష్మ వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కాబ‌ట్టి ఈ సినిమాపై ఓ మోస్తారు అంచ‌నాలు ఉన్నాయి.

మొద‌టి భీష్మ టీమ్ అయిన నితిన్‌, ర‌ష్మిక‌, వెంకీ కుడుముల క‌లిసి ఈ సినిమా చేస్తున్నారు అని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ర‌ష్మిక త‌ప్పుకుంది. ఆమె త‌ర్వాత శ్రీ‌ల‌ల‌ను హీరోయిన్ అనుకున్నారు, కాని ఎక్స్‌ట్రాఆర్డిన‌రీమేన్ డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో మ‌రో హీరోయిన్‌ని వెతుక్కునే పనిలో ప‌డిందంట టీమ్‌..రీసెంట్‌గా ఓ హిట్ సినిమాలో న‌టించిన యంగ్ హీరోయిన్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

Read More: చెల్లెలి పెళ్లిల‌లో ప్ర‌మ‌ఖ తార‌లు..

ట్రెండింగ్ వార్తలు