April 8, 2024
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి పేరు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసాము అంటే ఆ హీరోలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి అందుకే ఈయన డైరెక్షన్లో ఒక సినిమా అయినా చేస్తే చాలు అని ఎంతో మంది సెలబ్రిటీలు ఆరాటపడుతూ ఉంటారు.
ఇలా రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక త్వరలోనే మహేష్ బాబుతో కూడా రాజమౌళి కొత్త సినిమా షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారు. ఇలా రాజమౌళి ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు అయితే ఈయన దర్శకత్వంలో హీరోలుగా నటించినటువంటి ఇద్దరు హీరోలు మాత్రం పూర్తిగా తమ కెరియర్ ను కోల్పోయారని చెప్పాలి. ఇలా జక్కన్న డైరెక్షన్లో సినిమాలు చేసి కెరియర్ కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..
రాజమౌళి దర్శకత్వంలో హీరోలుగా నటించినటువంటి వారిలో హీరో నితిన్ అలాగే కమెడియన్ సునీల్ కూడా ఒకరు. నితిన్ హీరోగా సై సినిమా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ కెరియర్ పెద్దగా ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదని చెప్పాలి. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయనకు నిరాశ ఎదురవుతుంది.
ఇక కమేడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నటుడు సునీల్ హీరోగా మారారు అయితే రాజమౌళి డైరెక్షన్లో సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే సినిమాలో నటించారు ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరోగా నటించిన ఈయనకు సక్సెస్ లేకపోవడంతో తిరిగి కమెడియన్ గాను అలాగే విలన్ పాత్రలలోను నటిస్తూ సునీల్ కెరియర్ లో బిజీ అయ్యారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమాలలో నటించిన ఇండస్ట్రీలో స్టార్స్ గా గుర్తింపు పొందలేకపోయారని చెప్పాలి.
Read More: బుల్లి ఏనుగుతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న చరణ్ క్లిన్ కారా, రైమ్ ఉపాసన.. ఫోటోలు వైరల్!