మారుతి దర్శకత్వం వహించిన `మంచి రోజులు వచ్చాయి` ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
November 26, 2021
సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’ డిసెంబర్3న ఆహా ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్, పద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఇండియాలో పాండమిక్ ప్రారంభం అవుతుంది. ఆ కారణంగా వారిద్దరూ స్వస్థలం హైదరాబాద్ చేరుకుంటారు. పద్మ తండ్రి గోపాలంకు తన కూతురంటే అమితమైన ప్రేమ. తన కూతురు మరో అబ్బాయితో ప్రేమలో ఉందనే విషయం గోపాలంకు తెలుస్తుంది. దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. సాధారణంగా గోపాలం భయస్థుడు. దాన్ని అలుసుగా తీసుకుని చుట్టూ ఉన్న వారి చిన్న చిన్న విషయాలకే ఆయన్ని భయపెడుతుంటారు. ఆ కారణంగా ఆయనలో భయం ఇంకా పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాంటి భయంతో కూతురి ప్రేమను ఆయన ఒప్పుకోడు. సంతోశ్ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో గోపాలం తనలోని భయాలను ఎలా అధిగమిస్తాడు. గోపాలం ఫ్యామిలీకి సంతోశ్ ఎలా సపోర్ట్‌గా నిలుస్తాడు? సంతోశ్, పద్మ ప్రేమను గోపాలం అర్థం చేసుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే డిసెంబర్ 3న ‘ఆహా’లో ప్రసారం కాబోయే ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూడాల్సిందే.