April 13, 2024
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.
మూవీ లాంచింగ్ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ… ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు’ తెలిపారు.
ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ కి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రాశీ సింగ్ సినిమా మాట్లాడుతూ… ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది. రాజ్ తరుణ్ తో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు’ తెలిపారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. పూజాకార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఇది చాలా మంచి కథ. క్రైమ్ కామెడీ జోనర్. నా ఫేవరట్ జోనర్. మీ అందరికీ ఆశీర్వాదం కావాలి’ అన్నారు
https://telugu.chitraseema.org/dancing-doll-got-a-chance-to-play-as-the-second-heroine-in-charans-rc-16/